సాహో దర్శకుడు సుజిత్‌కు మళ్ళీ ఎందుకు అవకాశం రాలేదు!
Prabhas, Sujit
టెక్నికల్‌గా మంచి పేరు తెచ్చుకున్న సాహోకు చిరంజీవి అభినందలు దక్కాయి. ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేయాలనేది ప్లాన్. అందుకు రంగం సిద్ధమైంది కూడా. మలయాళసినిమా లూసిఫర్ ను రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ పనులుకు సుజిత్ సిద్ధం అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రానికి వినాయక్ లైన్‌లోకి వచ్చాడు. దాంతో స్క్రిప్ట్ దశలోనే సుజిత్ తప్పుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి వరసపెట్టి నాలుగు సినిమాలు చేయడం మొదలు పెట్టారు. కానీ సుజిత్‌కు అవకాశం మాత్రం అందులో ఏ ఒక్క సినిమాకూ రాలేదు.
అంతర్లీనంగా కొంతమంది పోకడవల్ల చిరంజీవి సినిమాలో తను తప్పుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద హీరోలకు కాంబినేషన్‌లు నిర్మాతలు చూస్తుంటారు. సాహో గొప్ప సినిమా అయినా అది కమర్షియల్‌గా అంతగా వర్కవుట్ కాలేదనీ టాక్ కూడా వుంది. ఆ తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి సుజిత్ ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. మరి అది ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలి.
