సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (16:34 IST)

హోం ఐసోలేషన్‌లో ఉన్నాను.. ఎంటర్‌టైన్ చేయండి.. ఖుష్బూ వినతి

సినీ నటి, భారతీయ జనతా పార్టీ మహిళా నేత ఖుష్బూ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అలాగే, సినీ నటి శోభన కూడా ఒమిక్రాన్ వైరస్ బారినపడిన విషయం తెల్సిదే. 
 
ఇదిలావుంటే ఖుష్బూ చేసిన ట్వీట్‌లో "మొదటి రెండు దశల కరోనా నుంచి తప్పించుకున్నాను. ఇపుడు చివరకు దాని చేతికి చిక్కాను. ఆదివారం సాయంత్రం వరకు నెగెటివ్‌లో ఉన్న నేను.. సోమవారం పాజిటివ్‌లోకి వచ్చాను. కొద్దిగా జలుబు ఉన్న కారణంగా సోమవారం పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. తేలికపాటి కరోనా లక్షణాలు తప్పితే మరో విధమైన ఇబ్బంది నాకు లేదు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. మరో ఐదు రోజుల పాటు ఒంటరిగా ఉండే నన్ను ఎంటర్‌టైన్ చేయాలంటూ సరాదాగా ట్వీట్ చేశారు. 
 
తనకు కోవిడ్ సోకిన విషయాన్ని వెల్లడించకముందు ఆమె "పుష్ప" సినిమా గురించి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమాను  చూశాను. అల్లు అర్జున్ అంకితభావం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది. సుకుమార్ దర్శకత్వం మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రష్మిక నటనతో దేవీశ్రీ ప్రసాద్ సంగీతంతో అదరగొట్టారన ఆమె పేర్కొన్నారు.