బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (13:41 IST)

హీరో బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్

తెలుగు అగ్ర హీరో బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించిన ఇషా చావ్లా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. 
 
కాగా, ఈమె 'ప్రేమ కావాలి' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించారు. అలాగే హీరో సునీల్ నటించిన 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్లి కొడుకు', 'జింప్ జిలానీ', 'విరాట్', 'రంభ ఊర్వసి మేనక' వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. 
 
ప్రస్తుతం బాలీవుడ్ దర్శకనిర్మాత కబీర్ లాల్ ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్న "దివ్య దృష్టి" అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.