బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (21:17 IST)

టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు కరోనా పాజిటివ్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ సోకింది. ఆయన వ్యక్తిగత హెయిర్‌స్టైలిస్ట్‌ ఇప్పటికే కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో మహేష్ బాబు కూడా ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఫలితాల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ విషయాన్ని మహేష్ బాబు గురువారం రాత్రి స్వయంగా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తనకు కోవిడ్ సోకిందని నిర్థారించారు. అలాగే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు.