కరోనా కోరల్లో మహారాష్ట్ర : ముంబైలో 200 మంది వైద్యులకు కరోనా
మహారాష్ట్ర కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. కరోనా థర్డ్ వేవ్ మొదలుకావడంతో ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా విలయతాండవం దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కొనసాగుతోంది. ఈ మహానగరంలో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
గత మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే 230 మంది వైద్యులకు ఈ వైరస్ బారినపడ్డారు. వీరంతా రెసిడెంట్ వైద్యులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని జేజే ఆస్పత్రి ప్రెసిడెంట్ గణేశ్ సోలంకి వెల్లడించారు. అలాగే, థానేలో కూడా ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకింది. అదేవిధంగా బ్రిహిన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఆరుగు ఉద్యోగులకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన ఉద్యోగుల సంఖ్య 60కి చేరింది.
కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఏకంగా 26538 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ముంబై మహానగరంలోనే 16166 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరవ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,76,032కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,505 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.