గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (13:52 IST)

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్‌కు కోవిడ్ పాజిటివ్

కరోనా వైరస్ మరోమారు ప్రపంచంలో ఉధృతంగా వ్యాపిస్తుంది. అమెరికా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అనేక అగ్రదేశాల్లో ఈ వైరస్ మహోగ్రరూపం దాల్చింది. భారత్‌లో కూడా ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో అనేక సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్‌కు కరోనా వైరస్ సోకింది. 
 
ప్రస్తుతం ఈయన బిగ్‌బాష్ టోర్నీలో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ జట్టుకు చెందిన ఆటగాళ్లలో ఇప్పటికే అనేక మందికి ఈ వైరస్ సోకింది. ఇపుడు మ్యాక్స్‌వెల్ 13వ ఆటగాడు కావడం గమనార్హం. 
 
ఈ జట్టుకు చెందిన 8 మంది సహాయక సిబ్బందికి, నలుగురు ఆటగాళ్లకు ఈ వైరస్ సోకింది. అయితే, బిగ్ ‌బాష్ టోర్నీలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో టోర్నీని నిర్వహకులు వాయిదావేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.