గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (15:59 IST)

తెరాస నేతల్లో కరోనా కలకలం - నేడు రంజిత్ రెడ్డికి - నిన్న ఎర్రబెల్లికి

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి చెందిన నేతల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వైరస్ బారినపడగా, ఆదివారం అధికార తెరాసకు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయినవారంతా కోవిడ్ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవ్వరూ తనను కలిసేందుకు రావొద్దని సూచించారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటీజెన్ రాబిట్ టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో రంజిత్ రెడ్డి హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.