Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా
ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, అందం పొందవచ్చని రెజీనా కసాండ్రా అన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. వెజిటేబుల్ కు ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ కలర్స్ (Kolors) తన నూతన బ్రాంచ్ కలర్స్ 2.0ను ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డు, పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన కలర్స్ (Kolors) హెల్త్‌కేర్ నూతన బ్రాంచీని హీరోయిన్ రెజీనా కాసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అత్యాధునిక చికిత్సలను శ్రీకాకుళం ప్రజల కోసం కలర్స్ హెల్త్‌కేర్ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. కలర్స్ సంస్థ అందిస్తున్న సేవలు ఇప్పటికే ఎందరిలోనో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా .మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, " శ్రీకాకుళం బ్రాంచ్‌ను ఆవిష్కరించిన రెజినా కు కృతజ్ఞతలు. 22 ఏళ్ల అనుభవం మాకు మరింత నమ్మకం ఇచ్చింది. నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరి ఆశకు కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ తోడ్పడుతుంది” అని అన్నారు.
కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన, ఆపరేషన్ విభాగ డైరెక్టర్ కృష్ణంరాజు తదితరులు మాట్లాడారు.