1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (16:58 IST)

సినిమా టిక్కెట్ల రాజకీయం : ఏపీలో తగ్గింపు - తెలంగాణాలో పెంపు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టిక్కెట్ల రాజకీయంనడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద రచ్చే సాగుతోంది. ఏపీ ప్రభుత్వ వైఖరిని చాలా మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది కోలీవుడ్‌కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అనుమతిచ్చిన మేరకు మల్టీప్లెక్స్‌లలో గరిష్ట ధర రూ.250కి పెంచుకునే వెసులుబాటువుంది. కానీ, ఏపీలో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర రూ.150 మాత్రమే కావడం గమనార్హం. 
 
తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన రేట్ల ప్రకారం మల్టీప్లెక్స్‌లలో కనిష్ట ధర రూ.100గాను గరిష్ట ధర రూ.250కి పెరగనుంది. అధికారుల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
 
అయితే, ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తివిరుద్ధం. ఏపీలోని మల్టీప్లెక్స్‌లలో కనీస ధర రూ.50గా ఉంటే గరిష్ట ధర రూ.150గా ఉంది. టిక్కెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం. ఈ ధరలపై చిత్రపరిశ్రమ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ప్రస్తుతం పరిస్థితి ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమ అన్నట్టుగా వుంది.