ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (12:50 IST)

తెలంగాణాలో క్రిస్మస్ - న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్‌తో పాటు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. ఒకవైపు, కరోనా వైరస్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్న నేపథ్యంలో కోవిడి పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేయాలని సర్కారుకు సూచన చేసింది. 
 
ముఖ్యంగా, క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలతో పాటు.. పండగ సీజన్‌లో ప్రజలంతా ఒక చోట చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.