1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (12:09 IST)

తెలంగాణను వణికిస్తున్న చలి: కొమరం భీమ్‌లో 3.5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రంగా ఉంటోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. 
 
ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. గిన్నెదరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 3.5 డిగ్రీలకు పడిపోయాయి. సిర్పూర్‌-యూలో 4 డిగ్రీలకు పడిపోయింది.  కొమరం భీమ్‌లో 3.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతోంది
 
ఆదిలాబాద్‌ ఏజెన్సీని మొత్తం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు నెగళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. 
 
క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ చలి తీవ్రంగా ఉంది.