బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (17:12 IST)

రాష్ట్రపతి శీతాకాల విడిది: 29న భాగ్యనగరానికి కోవింద్

ప్రతిఏటా శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ఆయన భాగ్యనగరానికి రానున్నట్లు రాష్ట్రపతి భవన్‌ నుంచి తెలంగాణ సర్కారుకు సమాచారం అందింది. 
 
ఈ పర్యటనలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అంతేగాకుండా జనవరి మూడో తేదీ వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. 
 
ఒమిక్రాన్‌ వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనపై కొద్దిరోజులుగా సందిగ్ధం నెలకొంది. అయితే రాష్ట్రపతి పర్యటనను ఖరారు చేస్తూ రాష్ట్ర అధికారులకు అధికారిక సమాచారం రావడంతో తగిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.