మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (11:43 IST)

తెలంగాణ ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం - టిక్కెట్లపై 20 శాతం రాయితీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన మార్క్‌తో విధులు నిర్వహిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి నడిపించేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దీన్ని అధిక సంఖ్యలో నగర వాసులు సందర్శించేలా ఆయన కీలక ప్రకటన చేశారు. విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రూ.100 టిక్కెట్‌పై 20 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. 
 
నగరంలో 24 గంటల టిక్కెట్‌పై ఈ నెల 27వ తేదీ వరకు తగ్గింపు పొందవచ్చని ఆర్టీసీ ఎండీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, నగరంలో 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా రూ.100 టీ24 టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందటూ ఆర్టీసీ వెల్లడించింది. ఈ ఆఫర్‌ను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.