1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Model School Teacher Tweet To TSRTC MD Sajjanar Over No Bus Facility

టీచర్ ట్వీట్.. స్పందించిన సజ్జనార్.. ప్రత్యేక బస్సు సౌకర్యం

Model School
మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఓ ఉపాధ్యాయురాలు ట్వీట్ చేసింది. ఆర్టీసీ ఎండీ దీనిపై తక్షణమే స్పందించి బస్సు సౌకర్యం కల్పించారు. 
 
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూలుకు దాదాపు 200 మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం వేళలో చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు రావడానికి బస్సులు లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఇదే మార్గంలో ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్న కోటపల్లి కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి విద్యార్థుల సమస్యలను వీడియో తీసి ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన సజ్జనార్.. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్ ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. టీచర్ భారతి, మోడల్ స్కూల్ విద్యార్థులు సజ్జనార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జనవరి-సెప్టెంబర్‌ మధ్యకాలంలో గృహ విక్రయాల వృద్ధి 12%: ప్రాప్‌టైగర్‌