OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన
OG's first day record collections
ఆనందం, పిచ్చి, ఉన్మాదం అన్నీ ఒక చారిత్రాత్మక వేడుకగా మూటగట్టుకున్నాయి అంటూ డివివి దానయ్య ఎంటర్ టైన్ మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్ కళ్యాన్ పాత్రకు అందరూ కనెక్ట్ అయ్యారని తెలియజేశారు. కాంబినేషన్ పడితే ఎలా ఉంటుందో ఎట్టకేలకి ఇప్పుడు ఓజి తో ప్రూవ్ అయ్యింది.
దర్శకుడు సుజీత్ చేసిన ఈ ఓజీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ మామూలుగా లేవు. ఓవర్ సీస్ తో సహా మొత్తం అద్భుతమైన వసూళ్ళు రాబట్టాయి. అభిమానులు, యూత్ సినిమాను బాగా ఆదిరిస్తున్నారని నిర్మాత తెలియజేస్తున్నారు. ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాసర్ ఓపెనింగ్స్ కొల్లగొట్టిన సినిమాగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసింది.
ఈ చిత్రం మొదటి రోజు 154 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ పోస్టర్ తో ప్రకటించారు. ఈ పోస్టర్ లో యంగ్ పవన్ కళ్యాణ్ గా కనిపించారు. అందుకే నిన్న జరిగిన మొదటి షోను చూసిన యూత్ అంతా లవర్ బాయ్ లా పవన్ వున్నాడంటూ ఐమాక్స్ లో నినాదాలు చేశారు. పవన్ కు గత చిత్రాలకంటే భారీగా వసూళ్ళు జరిగిందని తెలుస్తోంది. కాగా, దీనిపై పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోయినా చాలా సంతోషంగా వున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ ముందు రోజు నుంచి తనకు వైరల్ ఫీవర్ సోకిందని పవన్ ప్రకటించాడు.