సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (16:51 IST)

తెలంగాణ రాష్ట్రంలో తొలి గే వివాహం - హాజరైన బంధుమిత్రులు

తెలంగాణా రాష్ట్రంలో తొలి గే వివాహం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చిన సుప్రియో, అభయ్‌లు ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ వివాహం శనివారం జరిగింది. 
 
మన దేశంలో స్వలింగసంపర్కం చట్టబద్ధత కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో విదేశాల్లో తరహాలోనే మన దేశంలో కూడా ఈ గే వివాహాలు జరుగుతున్నాయి. ఈ సంస్కృతి మెల్లగా తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఫలితంగా తెలంగాణాలో తొలి స్వలింగ సంపర్క వివాహం జరిగింది. 
 
హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా సుప్రియో పనిచేస్తుంటే, అభయ్ మాత్రం సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా కొనసాగుతున్నాడు. వీరిద్దరూ గత ఎనిమిదేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత వీరి అభిప్రాయాలు కలవడంతో వీరిద్దరూ ప్రేమించుకోవాలని నిర్ణయం తీసుకుని, తమ పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.