గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:01 IST)

తెలంగాణా భాజపా నేతలకు అమిత్ షా క్లాస్

తెలంగాణా రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా జరిపిన భేటీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ఎక్కడ కూడా బిజెపి తగ్గకూడదని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

 
ఢిల్లీ వేదికగా జరిగిన భేటీలో మొత్తం 20 నిమిషాల పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పరిస్థితితో పాటు నేతలు ఏవిధంగా కష్టపడాలన్న విషయంపై అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

 
తెలంగాణాలో టిఆర్ఎస్ పైన యుద్ధం చేయాలని బిజెపి నేతలకు అమిత్ షా దిశానిర్ధేశం చేశారట. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండకట్టాలని.. అలాగే పోరాటం కూడా చేయాలని ఆదేశించారట.

 
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్‌ను అభినందించారట అమిత్ షా. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని సూచించారట. 
 
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరి స్పష్టంగా ఉందని.. టిఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని పలువురు నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారట.