1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:35 IST)

హస్తినలో కేంద్ర హోం మంత్రితో టీబీజేపీ నేతల కీలక భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు గురువారం ఢిల్లీలో కలుసుకోనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హోం మంత్రి అమిత్ షా అపాయింట్మంట్ కోరగా అదుకు ఆయన సమ్మతించారు. దీంతో గురువారం ఢిల్లీకి వెళ్లే టీబీజీపీ నేతలు అమిత్ షాతో సమావేశమవుతారు. వారి వెంట కేంద్ర మంత్రి కిషన్ సింగ్ కూడా ఉంటారు. 
 
ఈ భేటీలో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్రం రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయంలో స్టేట్ గవర్నమెంట్ వైఖరిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది.