1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (16:27 IST)

ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని తెలంగాణాలో కాలేజీలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో గత వారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 
 
ఈ బంద్‌లో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ వంటి అనేక విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మరోమారు ఉచితంగా జవాబు పత్రాల మూల్యాంకన జరపాలని కోరారు. అలాగే, ఎలాంటి ఫీజు లేకుండా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు జరపాలని ఆ విద్యార్థి సంఘాల నేతలతో పాటు ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాం తదితరులు పాల్గొన్నారు.