బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (16:18 IST)

సైనికుల ఆత్మరక్షణ కోసమే కాల్పులు.. ఘటన విచారకరం: అమిత్ షా

నాగాలాండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. దీనిపై కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనిక బలగాలు కాల్పులు జరిపాయని వెల్లడించారు. 
 
పైగా, నాగాలాండ్‌లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే వుందని సభకు తెలిపారు. అంతేకాకుండా, నాగాలాండ్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామనీ  బృందం వచ్చే 30 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. పైగా, నాగాలాండ్ ఘటనపై తాము రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. 
 
కాగా, నాగాలాండ్‌లో భద్రతా బలగాలు పొరపాటు తీవ్రవాదులుగా పొరపడి సామాన్య పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయం తెలుసున్న స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా భగ్గుమనేలా చేసింది. 
 
మరోవైపు, ఈ ఘటనపై సైన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ దురదృష్టకర ఘటనపై సైన్యం కూడా ఉన్నత స్థాయి విచారణ జరుపుతుందని మంత్రి అమిత్ షా వెల్లడించారు.