శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (12:21 IST)

హైదరాబాదులో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో మరో నాలుగు కొత్త కేసులు నమోదైనాయి. ఇతర దేశాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)కు చేరుకున్న ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా నలుగురికి సార్స్-కోవీ-2 లోని ఓమిక్రాన్ వేరియెంట్‌ సోకింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
 
దీనితో తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 24కు చేరుకుంది. మంగళవారం మొత్తం 726 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్‌జీఐఏకు చేరుకున్నారు, వీరిలో 4 మంది కోవిడ్-19కు పాజిటివ్‌గా పరీక్షించారు. నలుగురు కోవిడ్ పాజిటివ్ ప్రయాణికుల రక్త నమూనాలను పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ప్రస్తుతం, మొత్తం 13 నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వేచి ఉన్నాయి.
 
ఆర్‌జిఐఎ లో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 9122 మంది ప్రయాణికులు ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 59 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 24 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.