బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (11:34 IST)

లిబియాలో దారుణం: 160 మంది జలసమాధి.. వలసదారులపై..?

లిబియాలో దారుణం చోటుచేసుకుంది. లిబియాలోని మధ్యధరా సముద్రంలో  రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 160 మంది జలసమాధి అయ్యారు. ఈ రెండు ప్రమాదాలు గత వారం రోజుల్లో జరిగాయని వలసదారుల విభాగం అధికార ప్రతినిధి సఫా సెహ్లి తెలిపారు. వీరంతా ఐరోపాకు అక్రమంగా వలసపోతున్నవారేనని చెప్పారు. 
 
చెక్క, రబ్బరు పడవల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై.. ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 1500మంది ప్రాణాలు కోల్పోయారని.. దాదాపు 12వేల మందిని భద్రతా సిబ్బంది లిబియాకు తీసుకొచ్చారని చెప్పారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, పేదరికం వల్ల వలసపోతున్న వారికి లిబియా ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.
 
లిబియాలో వలసదారులపై దారుణాలు జరుగుతున్నాయి. తిరిగి వచ్చిన వారిని బలవంతపు కార్మికులను చేయడం, కొట్టడం, అత్యాచారాలకు పాల్పడటం జరుగుతోంది. వలసదారులు అక్రమ రవాణాదారుల పడవలపై లిబియాను విడిచిపెట్టడానికి అనుమతించడానికి ముందు కుటుంబాల నుండి డబ్బును దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.