చియోపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - 53 మంది వలస కూలీల మృతి
మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 53 మంది మృత్యువాతపడ్డారు. చియాపాస్‌లో వలస కూలీలతో వెళుతున్న ట్రక్కులారీ ఒకటి ఫుట్‌పాత్ డివైడర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది చనిపోగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఇదిలావుంటే, మృతులతోపాటు.. క్షతగాత్రులు అమెరికాకు చెందినవారిగా గుర్తించారు. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘోర ఘటన జరిగింది. ట్రక్కులో వంద మందికిపై వలస కూలీలకు పైగా ఉన్నప్పటికీ డ్రైవర్ అమితవేగంతో వాహనాన్ని నడిపారు. అది నియంత్రణ కోల్పోయి డివైడర్ గోడను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.