మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (11:32 IST)

నదియా జిల్లాలో దారుణం.. అంతిమ సంస్కారాలకు వెళుతూ...

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యుని అంతిమ సంస్కారాలకు వెళుతూ 17 మంది మృత్యువాతపడ్డారు. ఈ దారుణం శనివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నదియా జిల్లాలో తమ కుటుం సభ్యుడు ఒకరు చనిపోయారు. అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు ఒక మెటాడోర్ వాహనంలో అంతిమ సంస్కారాలకు బయలుదేరారు. 
 
అయితే ఈ వాహనం రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ అంతిమ సంస్కారాలకు 20 మంది కలిసి మెటాడోర్ వాహనంలో వెళుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.