బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (18:09 IST)

అయ్యో, సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి కుటుంబానికి చెందిన ఆరుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

 
సుశాంత్ మేనల్లుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బీహారు రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. సుశాంత్ సమీప బంధువు సోదరి అంత్యక్రియలకు హాజరైన తర్వాత పాట్నా నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

 
వీరు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో 10 మంది ప్రయాణిస్తుండగా ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.