సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (08:47 IST)

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు - సాయం చేసిన మంత్రి కేటీఆర్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సాయం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న విద్యార్థులను ఆస్పత్రికి తరలించేందుకు తన కాన్వాయ్‌ వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. 
 
బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
 
అదేసమయంలో కాన్వాయ్‌గా అటునుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ గాయపడి రక్తమోడుతున్న యువకులను చూశారు. వెంటనే కారు ఆపి కిందికి దిగారు. ప్రమాదం గురించి తెలుసుకున్నారు. రక్తమోడుతున్న విద్యార్థులను తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.