శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (11:37 IST)

గవర్నర్‌ హరిచందన్‌కు స్వల్ప అస్వస్థత - హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను తక్షణం చికిత్స కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి తరలించారు. 
 
ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 
 
ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఏంటి..? ఏ చికిత్స జరుగుతోంది..? లాంటి విషయాలు మాత్రం ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన తర్వాతే తెలియనున్నాయి. ఆయన వయస్సు 87 సంవత్సరాలు.. 2019లో ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.