గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (17:45 IST)

ఆరోగ్యం కోసం ఉపాస‌నా ఐదు వ్యాయామ చిట్కాలు

Upasana tips
రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిదెల రోజూ వ్యాయామాన్ని చేస్తుంటుంది.దానితోపాటు యోగా కూడా చేస్తుంది. ఇందుకు సంబంధించిన విష‌యాల‌ను అప్పుడ‌ప్పుడు త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది కూడా. రెండేళ్ళ‌నాడు స‌మంత‌తో ఆరోగ్యం గురించి, ఎక్స‌ర్‌సైజ్‌, బాడీ ఫిట్ నెస్ గురించి ఇంట‌ర్వూ చేసింది. అది ఇటీవ‌లే మ‌ర‌లా వెలుగులోకి వ‌చ్చింది.
 
కానీ, తాజాగా ఈరోజు ఉపాస‌న ఉద్యోగ‌స్తులైన మ‌హిళ‌ల‌కోసం ప్ర‌త్యేకంగా చిట్కాల‌ను తెలియ‌జేసింది. ఐదు ఎక్సర్ సైజ్‌లు, భంగిమ‌ల‌ను కూర్చొని ఎలా చేయ‌వ‌చ్చో తెలియ‌జేస్తూ త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టింది. కంట‌ప్యూల‌ర్ ఉద్యోగిణులు కానీ ఇత‌ర ఉద్యోగాల‌లో కుర్చీని కూర్చుని  వున్న‌వారు ఇవి త‌ప్ప‌కుండా పాటిస్తే ఎటువంటి నొప్పులు రావ‌నీ, సైడ్ ఎఫెక్ట్‌లేని ఎక్స‌ర్ సైజ్ అంటూ చెబుతోంది.
 
ముందుగా నెక్ ఎక్స‌ర్ సైజ్‌ను చూపిస్తూ, రెండు చేతులు బ‌ల్ల‌పై పెట్టి మెడ‌ను ఎలా పైకి కింద‌కు నెమ్మ‌దిగా క‌ద‌పాలో చూపించింది. అదేవిధంగా కాళ్లు చేతుల‌తో చిన్న‌పాటి వ్యాయామాలు ఇలా చేయాల‌ని చెప్పింది. ఈ పోస్ట్ పెట్టి గంట‌లోనే మంచి స్పంద‌న వ‌చ్చింది. సో. ఇంకేం మ‌హిళ‌లు బీ రెడీ.