దీపావళితో కుటుంబంతో గడిపిన స్టార్లు
ప్రతి పండుగకు సినిమా స్టార్లు వారి వారి కుటుంబాలతో గడపడం చాలా అరుదైన విషయం. అందులోనూ కరోనా తర్వాత అందరూ ఇళ్ళల్లో వుండడంతో వారి వారి కుటుంబాలతో ఆప్యాయతలు పెరిగాయి. ఇక దీపావళి అనేది ప్రతివారికి సెంటిమెంట్అనే చెప్పాలి. ఆరోజు లక్ష్మీదేవిని పూజించి కుటుంబంతో కలిసి గడపటం ఇష్టంగా భావిస్తారు. కార్తీకమాసం శుక్రవారం ఆరంభంతో ధనలక్ష్మీ పూజలు చేసినట్లు అడవిశేషు, అనసూయ తెలియజేస్తున్నారు.
రామ్‌చరణ్ తన సోదిరీమణులతోపాటు తన స్థాయి అన్నదమ్ములతో వారి కుటుంబాలతో హాయిగా గడిపిన స్టిల్‌ను పోస్ట్ చేశారు. దీపాళినాడు అందరం కలిసి ఇలా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా వుందని పేర్కొన్నాడు. ఇదే విధంగా విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ, తల్లి తండ్రులతో కలిసి ఇలా ఫోజు ఇచ్చారు. తన కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక సహజ నటుడుగా పేరుపొందిన నాని కూడా తన కుమారుడితో ఇలా లాలిస్తూ గడిపారు.
గాయమైనా పిల్లలతో ఎన్‌టిఆర్. దీపావళి
మరోవైపు అడవిశేషు తన తల్లి దండ్రులతో దీపావళినాడు ఇలా పూజ చేస్తూ కలవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఇక ఎన్.టి.ఆర్. జూనియర్ మాత్రం తన ఇద్దరు కుమారులైన అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో ఇలా ఫొటో దిగారు. అయితే ఎన్.టి.ఆర్. కుడిచేతికి గాయమైంది. అది ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
వీరే కాకుండా కృష్ణ కుమార్తెలు తమ తండ్రి వద్దకు వచ్చి దీపావళి నాడు ఆశీర్వాదం తీసుకున్నారు. అనసూయ తను ఇంటిలో దీపాలు వెలిగిస్తూ ఆనందంగా జరుపుకున్నట్లు పేర్కొంది. అదేవిధంగా కంగనా రనౌత్ కూడా దీపావళి తమకు ప్రత్యేకం అంటూ పూజ చేస్తూ అభిమానులను అలరించింది.