దీపావళి ముహూరత్ ట్రేడింగ్... లాభంతో ముగిసిన సెన్సెక్స్
దీపావళి పండుగ సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లలో మూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయతీగా వస్తుంది. ఈ దీపావళి రోజు సాయంత్రం పూట కొన్ని గంటల ఈ ట్రేడింగ్‌ను నిర్వహిస్తుంటారు. ఇలా ట్రేడింగ్ నిర్వహిస్తే శుభాలను కలిగిస్తుందని కంపెనీలు, మదుపరుల్లో ఓ సెంటిమెంట్ బలంగా వుంది.
ఇందులోభాగంగా, గురువారం దీపావళి మూరత్‌ను నిర్వహించాయి. ఈ మూరత్ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే దేశీయ మార్కెట్ల లావాదేవీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో ముందంజ వేశాయి. ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐఓసీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. నేటి రాత్రి 7.15 గంటల వరకు మూరత్ ట్రేడింగ్ సాగనుంది.