సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (14:10 IST)

యంగ్‌టైగర్ చేతికి మైనర్ సర్జరీ

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు మైనర్ సర్జరీ జరిగింది. ఇంట్లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ కుడి చేతి వేలికి గాయం కావడంతో ఆయనకు వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసినట్టు సమాచారం. 
 
ప్రస్తుతం వైద్య సిబ్బంది సూచనలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే, ఈ విషయం గురువారం నుంచి సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ‌లో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో "కోమరం భీం" పాత్రలో నటిస్తున్నాడు ఎన్టీఆర్‌.