గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (15:42 IST)

ఉపాసన గారూ గుడ్ న్యూస్ ఎప్పుడు.. షాకింగ్ యాన్సర్

మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మెగా కోడలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు అని.. వీరి పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఇప్పటివరకు వీరి నుంచి గుడ్ న్యూస్ రాలేదని అభిమానులు కొంచెం అసహనం చేస్తున్నారు. అయితే తాజాగా పిల్లల గురించి ఉపాసన షాకింగ్ కామెంట్స్ చేసింది.
 
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనను యాంకర్ జూనియర్ చెర్రీని, జూనియర్ ఉపాసనను ఎప్పుడు చూపిస్తున్నారు అని అడుగగా.. ఉపాసన తడుముకోకుండా “దీని గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను.. ఈ విషయంలో ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. ఏదిపడితే అది చెప్తే అది సెన్సేషన్‌గా మారుతుంది.. అందుకే ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడను” అంటూ చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మెగాస్టార్ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.. త్వరగా గుడ్ న్యూస్ చెప్పండి ఉపాసన గారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.