ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి
దర్శకుడు రాజమౌళి సినిమారంగంలోని అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం విడుదలైన ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్ వీడియోకి అనూహ్య స్పందన వచ్చింది. ఒక్కరోజులో 12 మిలియన్స్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే.. 987.7 కె లైక్స్ రావడం కూడా రికార్డే. అందుకే ఈ గ్లింప్స్ కు వస్తోన్న భారీ రెస్పాన్స్ పై దర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో తన ట్విట్టర్ ద్వారా ప్రతిస్పందించారు.
ఆర్.ఆర్.ఆర్ గ్లింప్స్ కు వస్తోన్న భారీ రెస్పాన్స్ కు చాలా సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమలోని ఎందరో స్నేహితులు, అభిమానులు పంపిన సందేశాలకు ధన్యవాదాలు. ఆర్.ఆర్.ఆర్ టీమ్ మొత్తం ఆ రెస్పాన్స్ కు ఖుషీ అవుతోంది.అని తెలియచేశారు.
వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్న ఆర్.ఆర్.ఆర్. టెక్నికల్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. కథకంటే విజువల్ వర్క్‌కు ఎక్కువ ప్రాధాన్యత వుంది. కీవారణి సంగీతం కూడా మార్కులు పడుతున్నాయి. ఇక సంక్రాంతివరకు ఇటువంటి రికార్డ్‌లు మరిన్ని రావచ్చని చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.