శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (18:20 IST)

భుజం నొప్పితో ఆస్పత్రిలో చేరిన హీరో బాలకృష్ణ

తెలుగు అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో చేరారు. భుజం నొప్పి తీవ్రం కావడంతో హైదరాబాద్ నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు డాక్ట‌ర్ ర‌ఘువీర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కేర్ ఆస్ప‌త్రి వైద్యుల బృందం బాల‌కృష్ణ‌కు సుమారు 4 గంట‌ల పాటు స‌ర్జ‌రీ చేసింది. 
 
అయితే అభిమానులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవుతార‌ని డాక్ట‌ర్లు తెలిపారు. బాల‌కృష్ణ‌కు ఆరు వారాల‌పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని తెలిపారు.
 
బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో "అఖండ" సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుద‌ల తేదీపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.