1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (09:37 IST)

ఆస్పత్రిలో చేరిన కేరళ మాజీ సీఎం - ఐసీయూలో చికిత్స

కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రముఖ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ ఆస్పత్రిలో చేరారు. 92 యేళ్ల వయసులో ఒకవైపు తీవ్ర వృద్ధాప్య సమస్యలపాటు.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను రాజధాని తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 
 
ప్రస్తుతం తన తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అతని కుమారుడు అరుణ్ కుమార్ తన ఫేస్‌బుక్ లో సమాచారాన్ని పోస్ట్ చేశారు. అచ్యుతానందన్ మూత్రపిండాల సమస్యలు, గ్యాస్ట్రో ఎంటెరిటీస్‌తో బాధపడుతున్నాడని, అతన్ని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నామని శ్రీ ఉత్రదోమ్ తిరునాల్ ఆసుపత్రి వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు.
 
కాగా, రెండేళ్ల క్రితం అచ్యుతానందన్ స్ట్రోక్‌తో బాధపడి తర్వాత అలపుజా జిల్లాలోని తన సొంత పట్టణానికి వచ్చారు. దిగ్గజ కమ్యూనిస్ట్ నాయకుడైన అచ్యుతానందన్ అనారోగ్యం కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. 2006లో తొలిసారి కేరళ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయన అత్యంత వృద్ధ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన విషయం తెల్సిందే. ఆసమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి చర్చల్లో నిలిచారు.