శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (11:15 IST)

అస్వస్థతకు లోనై కైకాల సత్యనారాయణ.. ఆస్పత్రిలో చేరిక

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం నటుడు కైకాల సత్య నారాయణ ఇంట్లో జారి పడినట్లు సమాచారం. 
 
అయితే.. శనివారం రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో కైకాల సత్య నారాయణను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో కైకాల సత్య నారాయణ చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, కైకాల సత్య నారాయణ ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా… నటుడు కైకాల సత్యనారాయణ ఎన్నో సినిమాల్లో తండ్రి, తాతయ్య పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.