1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 30 అక్టోబరు 2021 (15:01 IST)

అభిమానికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన మెగాస్టార్!

చిరంజీవి… తన అభిమానులను ర‌క్త సంబంధీకులుగా పోలుస్తారు. వారిని ఆపదలో ఆదుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే మెగా స్టార్‌ను.. మెగా ప్యామిలీని.. చిరు అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు, ఆదరిస్తారు. అయితే తాజాగా ఓ అభిమాని కోసం మెగాస్టార్ చేసిన పని మరో సారి అందరి హృదయాల‌ను హ‌త్తుకుంటోంది. 
 
 
విశాఖకు చెందిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనకు చిరంజీవిని కలవాలని ఉందని ట్విట్టర్ ద్వారా వెంకట్ కోరికను తెలియజేశాడు. వెంకట్ గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అతనిని హైదరాబాద్ పిలిపించి అతనితో 45 నిమిషాలు పాటు మాట్లాడారు. అత‌ని అనారోగ్య విషయం తెలుసుకొని హైదరాబాదులోని ఒమేగా హాస్పిటల్ లో చేర్పించారు.


ఎంత ఖర్చయినా పర్వాలేదు... నా అభిమాని ఆరోగ్యం కుదుట పడాలని ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు. ఒకవేళ కావాలంటే చెన్నై లోని మెరుగైన హాస్పిటల్ కు తరలించడానికి వెనుకాడన‌ని ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తెలియజేశారు చిరంజీవి.  అభిమాని గురించి,  ఈ విధంగా ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్న చిరంజీవిపై ఫ్యాన్స్ నీరాజ‌నాలు తెలుపుతున్నారు.