విభిన్న తరహా కంపెనీ ఎస్టీ లౌడర్ కంపెనీస్ (ఈఎల్‌సీ), రొమ్ము క్యాన్సర్ ప్రచారం అత్యుత్తమ ఈఎల్‌సీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. బ్యూటీ స్ఫూర్తినొందిన, విలువల చేత నడుపబడుతున్న కంపెనీ, ఈఎల్‌సీ తాము చేసే ప్రతి అంశంలోనూ ప్రజలు, సానుకూల ప్రభావం, సమ్మిళితతను దృష్టిలో పెట్టుకుంటుంది. ఈ కారణం చేతనే ఈ కంపెనీ ప్రతి ఒక్కరికీ రొమ్ము క్యాన్సర్‌ను అంతమొందించేందుకు సహాయపడటానికి ముందుకొచ్చింది. రొమ్ము క్యాన్సర్‌ను అంతమొందించడానికి సహాయపడటానికి ఈఎల్‌సీ యొక్క పిలుపు గతానికన్నా అత్యంత అత్యవసరమైనది.
ఎందుకంటే, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది గతానికన్నా ఎక్కువగా అత్యంత సహజంగా కనుగొనడం జరుగుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులను వెనక్కి నెట్టిన సంఘటన తొలిసారిగా 2020లో కనిపించింది. ఓ అంచనా ప్రకారం 2.3 మిలియన్ నూతన కేసులు ఇప్పుడు ఉన్నాయి. రొమ్ముక్యాన్సర్ రహిత ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రజలను ఏకం చేయడానికి ఎస్టీ లౌడర్ కంపెనీల రొమ్ముక్యాన్సర్ ప్రచారాలు (ద క్యాంపెయిన్) ఎందుకు తిరుగులేనివిగా నిలుస్తాయనేది ఈ భయంకరమైన గణాంకాలు పునరుద్ఘాటిస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ను తుదముట్టించడానికి ఇది సమయం.
పింక్ రిబ్బన్‌ను ఎవ్లీన్ హెచ్ లౌడర్ సహ సృష్టించడంతో పాటుగా 1992లో ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి అంతర్జాతీయంగా రొమ్ము క్యాన్సర్ ఉద్యమంలో కార్పోరేట్ లీడర్‌గా ఎస్టీ లౌడర్ కంపెనీస్ నిలుస్తాయి. ఈ ప్రచారంకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా సంస్ధలకు మద్దతునందించడంతో పాటుగా నిధులను సమీకరించడం, విద్య, మద్దతునందించడంతో పాటుగా రొమ్ము క్యాన్సర్ లేని ప్రపంచానికి మనల్ని దగ్గరగా చేస్తుంది.
దేశంలో అతిపెద్ద కార్పోరేట్ సామాజిక ప్రభావ కార్యక్రమంగా వెలుగొందుతున్న ద క్యాంపెయిన్, 99 మిలియన్ డాలర్లను అంతర్జాతీయంగా సమీకరించింది. ఈ నిధులను జీవితాలను కాపాడే పరిశోధన, విద్య, వైద్య సేవలు కోసం వినియోగిస్తారు. 80 మిలియన్‌లకు పైగా నిధులను 321 వైద్య పరిశోధనా గ్రాంట్లుగా బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ (బీసీఆర్‌ఎఫ్) ద్వారా అందించారు. యుఎస్‌లో అత్యున్నత గౌరవం పొందిన లాభాపేక్ష లేని రొమ్ము క్యాన్సర్ సంస్థ ఇది. ఎవ్లీన్ హెచ్ లౌడర్ దీనిని 1993లో ప్రారంభించారు.
విలియం పీ లౌడర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్-ఎస్టీ లౌడర్ కంపెనీస్ ఇంక్ మాట్లడుతూ, బ్యూటీ స్ఫూర్తినొందిన, విలువల చేత నడుపబడుతున్న కంపెనీగా, అర్థవంతమైన సామాజిక పెట్టుబడులను ప్రపంచవ్యాప్తంగా మా ఉద్యోగులు, వినియోగదారులు, భాగస్వాములకు అతి ముఖ్యమైన అంశాలలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాం. ఎస్టీ లౌడర్ కంపెనీలలో కుటుంబ విలువలు ఎల్లప్పుడూ అత్యంత కీలకంగా ఉంటాయి. మా అమ్మ ఎవ్లీన్ హెచ్ లౌడర్, ఈ ఎస్టీ లౌడర్ కంపెనీస్ రొమ్ము క్యాన్సర్ అవగాహన ప్రచారం ప్రారంభించడంతో పాటుగా పింక్ రిబ్బన్ ను సహ సృష్టించారు. రొమ్ము క్యాన్సర్ రహిత ప్రపంచం సాకారం చేయాలని ఆమె కలలుగన్నారు. ఈ ప్రచారం, రొమ్ము క్యాన్సర్‌ను అంతమొందించడానికి సహాయపడే మహోన్నత లక్ష్యానికి కట్టుబడింది అని అన్నారు.
రోహన్ వజిరాలీ, జనరల్ మేనేజర్, ఎస్టీ లౌడర్ కంపెనీస్ ఇంక్ మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ అనేది ఓ వ్యాధి కాదు. దానికంటూ ప్రత్యేక కథ ఉంది. ఇది ఈఎల్‌సీ యొక్క వైవిధ్యమైన అంతర్జాతీయ కమ్యూనిటీలాగానే వైవధ్యమైనది. ఇది స్పృశించిన ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అంటే రోగులు, వారిని అభిమానించే వారు, డాక్టర్లు, కేర్‌గివర్లు, అడ్వొకేట్లు, మరియు మరెంతో మంది ఉన్నారు.
ఎస్టీ లౌడర్ కంపెనీస్ సగర్వంగా మద్దతునందించడంతో పాటుగా విద్య, మద్దతుకు తమ నిబద్ధతను వేడుక చేస్తుంది మరియు స్ధానిక చారిటీ భాగస్వాములు, అవసరమైన కమ్యూనిటీలపై సానుకూల ప్రభావం చూపేందుకు తగిన నిధులను సమీకరించడం చేస్తుంది. ఈ ప్రపంచం మారిందని మాకు తెలిసినప్పటికీ, మా జీవిత కాలంలోనే ఈ రొమ్ము క్యాన్సర్‌ను అంతమొందించాలనే మా రొమ్ము క్యాన్సర్ ప్రచారాల ధృడ నిబద్ధత గతం కన్నా బలంగా ఉంది అని అన్నారు.
ఈ సంవత్సరపు క్రియేటివ్,పింక్ రిబ్బన్ పొరలను ప్రదర్శిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌కు అంతర్జాతీయంగా గుర్తించిన గుర్తు అది. ఈ పింక్‌లోని విభిన్నమైన షేడ్స్, విభిన్నమైన టెక్చర్లు మరియు డిజైన్స్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో పాటుగా ఈ వ్యాధి యొక్క వైవిధ్యతను వెల్లడిస్తాయి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రొమ్ము క్యాన్సర్ కమ్యూనిటీకి మద్దతునందించడంలో ఐక్యతను ఈ ప్రచారం ఆశిస్తోంది.
ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 01వ తేదీ నుంచి భారతదేశంలో తమ లక్ష్యాలకనుగుణంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తుంది:
1. ముందుగా వ్యాధిని గుర్తించడం పట్ల అవగాహన కల్పించడం మరియు రొమ్ము ఆరోగ్య ఆవశ్యకతను...
2. ఉద్యోగులు, రిటైల్ భాగస్వాములు, ఇన్ఫ్లూయెన్సర్లు మరియు అంబాసిడర్ల కోసం విద్యా అవగాహన సమావేశాలు.
3. రొమ్ము ఆరోగ్య ఆవశ్యకత పట్ల ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ డాక్టర్లు,క్యాన్సర్ విజేతలతో అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
4. స్నేహితులు, భాగస్వాములు, సహచరులు, కొలీగ్స్ నడుమ డిజిటల్‌గా అంతర్జాతీయ బ్రోచర్లను డిజిటల్‌గా పంపిణీ చేయడంతో పాటుగా క్లింక్ , బాబీ బ్రౌన్ మరియు ఎస్టీ లౌడర్ ఇండియా బ్రాండ్ వెబ్‌సైట్ల నుంచి ఆన్‌లైన్ కొనుగోళ్లను సైతం చేయవచ్చు.
5. శక్తివంతమైన అవగాహన కోసం నూతన సోషల్ కాల్ టు యాక్షన్ క్యాంపెయిన్
6. పింక్ రిబ్బన్ యొక్క పవర్ టు యునైట్ స్ఫూర్తితో, ఈ క్యాంపెయిన్ ఉద్యోగులు, భాగస్వాములు, విజేతలు,బ్రాండ్ ప్రచారకర్తలు, ఇన్‌ఫ్లూయెన్సర్లను ఒకే దరికి తీసుకువచ్చి పింక్ రిబ్బన్ అంటే వారికి ఏమిటనేది #TimetoEndBreastCancer #BCCIndia2021 యాష్‌ట్యాగ్స్ ద్వారా తెలుపడం.
7. ప్రభావశీల స్ధానిక చెఫ్ రాహుల్ అక్రేకర్‌తో భాగస్వామ్యం చేసుకుని వర్ట్యువల్ ఫండ్ రైజర్‌ను ఈ క్యాంపెయిన్ యొక్క ఫండ్‌రైజింగ్ గోల్స్‌కు మద్దతునందించడం ద్వారా తెలుపనున్నారు.
ద క్యాంపెయిన్‌కు సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ అంబాసిడర్ వ్యవహరిస్తున్న ఎలిజబెత్ హర్లే మాట్లాడుతూ, బ్రెస్ క్యాన్సర్ క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ ప్రచారకర్తగా నా బాధ్యత, నా జీవితంలో అత్యంత అర్థవంతమైన పనిగా నిలుస్తుంది. ఎవ్లీన్ 1990లో ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన అనతికాలంలోనే నేను ఆమెతో కలిసిపనిచేసేందుకు చేరాను. ఈ క్యాంపెయిన్, అత్యంత శక్తివంతమైన ప్రభావం చూపడంతో పాటుగా ఎస్టీ లౌడర్ కంపెనీస్ ఇప్పుడు అత్యుత్తమమైన బ్రెస్ట్ క్యాన్సర్ కమ్యూనిటీగా నిలిచింది. పరిశోధన ద్వారా సాధించిన అద్భుతమైన పురోగతితో ద క్యాంపెయిన్, ఇప్పుడు అత్యాధునిక సైన్స్, చికిత్సలు, సంరక్షణకు నిధులను సమకూరుస్తుంది. మనమంతా తప్పనిసరిగా ఎవ్లీన్ వారసత్వం కొనసాగించడంతో పాటుగా క్యాంపెయిన్‌కు మద్దతునందించి,ఈ వ్యాధికి తగిన చికిత్సనందించాలి అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు, వినియోగదారులు, భాగస్వాముల సమ్మిళిత ప్రయత్నాల ద్వారా ఈ క్యాంపెయిన్ ఈ వ్యాధికి వ్యతిరేకంగా నిజమైన పురోగతిని సులభతరం చేయడంలో ఈ క్యాంపెయిన్ ముందంజలో ఉంది. అంతర్జాతీయ కమ్యూనిటీ యొక్క అంకిత భావంతో, అందరికీ రొమ్ము క్యాన్సర్ రహిత ప్రపంచం సృష్టించడంలో ఈఎల్‌సీ సహాయపడుతుంది.