మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (18:24 IST)

హీరో బాల‌య్య‌కు భుజం నొప్పి... కేర్ లో ఆప‌రేష‌న్!

న‌ట సింహం బాల‌య్య అభిమానుల‌కు ఇదో షాకింగ్ న్యూస్. గ‌త కొద్ది రోజులుగా బాల‌య్య తీవ్ర‌మైన భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. ఈ కార‌ణంగా ఆయ‌న షూటింగ్ కూడా అన్య‌మ‌న‌స్కంగా పాల్గొంటున్నారు. అఖండ షూటింగ్ లో బాల‌య్య ఈ మ‌ధ్య ఫుల్ బీజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, భుజం నొప్పి కార‌ణంగా ఆయ‌న చాలా బాధ‌ప‌డుతూనే షూటింగ్ చేస్తున్నారు. దీనితో ఎట్ట‌కేల‌కు హీరో నందమూరి బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ చేశారు.

 
కొంతకాలంగా ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ త‌న ఎడమ భుజం నొప్పితో బాధ పడుతున్నారు. నిన్న కేర్ హాస్పిటల్లో డాక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయ‌న‌కు భుజం ఆపరేషన్ జ‌రిగింది. మంగ‌ళ‌వారం సాయంత్రం డిశ్చార్జ్ కానున్న బాలకృష్ణకు ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు పూర్తి చేశారు. ఆప‌రేష‌న్ అనంత‌రం బాల‌య్య‌కు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు.