శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (08:10 IST)

పోలీస్ జీపుకు ప్రమాదం : విశాఖపట్టణంలో సీఐ మృతి

ఓ గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. 
 
సీఐ ఈశ్వరీరావు, మరో కానిస్టేబుల్ రాత్రివేళ విధులు ముగించుకుని స్టేషన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీసు జీపు ముందుగా బాగా దెబ్బతింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలికి చేరుకుని గాయపడిన కానిస్టేబుల్‌ను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జిరగింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం జాతీయ రహదారిపై అమర్చిన సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను నిశితంగా విశ్లేషిస్తున్నారు.