శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో తుపాకీ మిస్‌ఫైర్..

సందర్శకులు, అధికారులతో నిత్యం రద్దీగా ఉండే కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో తుపాకీ ఒకటి మిస్‌ఫైర్ అయింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ ఘటన జరిగింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయమైంది. తుపాకీలోనుంచి వచ్చిన బుల్లెట్ ఆయన ఛాతిలోకి దూసుకెళ్లింది. దీంతో ఆయన్ను సహచర సిబ్బంది హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కలెక్టరేట్‌లోని ట్రెజరీ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
మరోవైపు, తుపాకీ మిస్‌ఫైర్ కావడంపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అయితే, ఈ మిస్‌ఫైర్ తుపాకీని శుభ్రపరిచే సమయంలో ట్రిగ్గర్‌పై చేతివేలు పడటంతో పేలివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు స్పందించిన పోలీసులు.. తుపాకీని స్వాధీనం చేసుకుని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.