గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (11:37 IST)

'ఆహా'లో "అన్‌స్టాపబుల్ బాలయ్య" - ముఖ్య అతిథిగా మహేష్ బాబు

తాజాగా "అఖండ" చిత్రంతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న యువరత్న బాలకృష్ణ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సెన్షేషన్ క్రియేట్ చేశారు. 'అఖండ' చిత్రం సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అదేసమంయలో ఆయన ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ బాలయ్య అనే షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ షోకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా హాజరుకానున్నారు. 
 
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఎపిసోడ్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం. నిజానికి వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ఏ ఒక్క షోలో పాల్గొనలేదు. చేయలేదు. ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ బాలయ్య షోకు మహేష్ బాబు చీఫ్ గెస్ట్‌గా రానుండటం ఇపుడు ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. పైగా, సోషల్ మీడియాలో అన్ స్టాపబుల్ బాలయ్య ఇపుడు ట్రెండ్‌గా మారింది. 
 
కాగా, ఈ షోకు తొలి ఎపిసోడ్‌లో మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, రెండో ఎపిసోడ్‌లో హీరో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు. ఇరుడు అంటే నాలుగో ఎపిసోడ్‌లో మహేష్ బాబు కనిపించనున్నారు.