ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (19:09 IST)

ఏపీ వరద బాధితుల కోసం టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 
 
ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులను ఆదుకునేందుకు నా వంతుగా ఇది చిన్న సాయమని పేర్కొన్నారు. అలాగే, చిరంజీవి, మహేష్ బాబులు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు.
 
కాగా, ఇటీవల ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, పంటలు దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వీరిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.