సిరివెన్నెల అంతిమ యాత్ర ప్రారంభం
నిన్న మరణించిన సిరి వెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని ఈరోజు ఉదయం 7గంటల తర్వాత హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌కు తీసుకువచ్చారు. ఛాంబర్ ఆవరణలో ఆయన పార్థివ దేహాన్ని ప్రముఖులంతా సందర్శించి నివాళులర్పించారు.
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్‌బాబు, జగపతిబాబు, జీవితా రాజశేఖర్‌తోపాటు దాదాపు అందుబాటులో వున్న సినీ ప్రముఖులంతా హాజరయి పార్దీవ దేహానికి నివాళులు అర్పిస్తారు.
మరోవైపు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపనున్నట్లు తెలిపారు.
- ఈరోజు పగలు 11.10 నిముషాలకు పార్థివ దేహాన్ని మహాప్రస్తానంకు తరలించారు. 12.30గంటల లోపుగా అంత్యక్రియలు ముగించనున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
హరీష్‌రావు మాట్లాడుతూ, సీతారామశాస్త్రి గారి రచనలు పండితులకు, పామరులకు అర్థమయ్యేలా వుండేవి. అశ్లీతలకు, ద్వందార్థాలులేని సాహిత్యాన్ని యువతరానికి అందించారు. సమాజంలో అందరినీ ఆయన గీతాలతో చైతన్యం చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆయన లేరనడం బాధ కలిగింది. రుద్రవీణ షూటింగ్ సమయంలో చెన్నైకి తీసుకు వచ్చాను. ఆ సినిమాకు మంచి సాహిత్యం ఇచ్చారు. ఆయనతో కలిసినప్పుడల్లా సాహిత్య చర్చే జరిగేది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానన్నారు. ఎన్.టి.ఆర్., మహేష్‌బాబులు మాట్లాడుతూ, ఆయన మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.