మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (19:45 IST)

లక్ష్య నుండి ‘సయ సయ’ లిరికల్ వీడియోను ఆవిష్క‌రించిన నాగ చైతన్య

Naga Shourya, Ketika Sharma
నాగ శౌర్య హీరోగా  స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’.  సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయగా.. సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అక్కినేని నాగ చైతన్య  ‘సయ సయ’ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
 
కృష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా.. కాళ భైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. ఈ పాటలో నాగ శౌర్య, కేతిక శర్మలు ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
 
జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
నటీనటులు : నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ తదితరులు న‌టించారు.