శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ.
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (19:42 IST)

భార‌తీయ క్రీడ - పోరాట స్పూర్తి ర‌గిలించేలా లక్ష్య ట్రైల‌ర్ (video)

Lakshya- Naga Shourya
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యం అన‌గానే ఏదో ఆట అనుకునే త‌రుణంలో హీరో నాగ శౌర్య ‘లక్ష్య’ం కోసం గురిపెట్టిన విలువిద్య పోస్ట‌ర్ ముందుగా ఆక‌ట్టుకుంది. అప్ప‌టికే జాతీయ‌స్థాయిలోనూ ఒలింపిక్స్‌లోనూ మ‌న దేశంనుంచి ఈ ఆర్చురీ విద్య‌లో పాల్గొని పేరు తెచ్చుకున్న‌వారు వున్నారు కాబ‌ట్టి ఈ ఆట‌ను మ‌రింత‌గా ప్ర‌పాచుర్యం తెచ్చే ప్ర‌య‌త్నంగా అనిపిస్తుంది.
 
ఎప్ప‌డూ క్రికెట్‌ అంటూ విదేశీ ఆట‌ను వెలుగులోకి తెచ్చేకంటే భార‌తీయుల పురాత‌న ఆట‌ను ఈత‌రానికి వెండితెర‌పై తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం దర్శకుడిగా పరిచయం కాబోతోన్న సంతోష్ జాగర్లపూడి చేయ‌డం అభినంద‌నీయం. అందుకు ముందుకు వ‌చ్చిన నిర్మాత‌లు సోనాలి నారంగ్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్  అభినంద‌నీయులే.
 
- ల‌క్ష్య టీజ‌ర్‌కు ముందు నాగ‌శైర్య  సిక్స్ ప్యాక్ అంటూ ఆయ‌న బాడీని చూపిస్తూ స్టిల్స్ విడుద‌ల చేశారు. ఇవి చూస్తే ఈ విద్య‌ను సిక్స్ పేక్‌ అవ‌స‌ర‌మా! అని అనిపిస్తుంది కూడా. దానికి స‌మాధానం డిసెంబ‌ర్ 10న థియేట‌ర్ల‌లో తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారంనాడు విక్ట‌రీ వెంక‌టేష్ ఆవిష్క‌రించి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
మ‌రి ఈ ట్రైల‌ర్ ఎలా వుందో చూద్దాం.
 
ఓపెన్ చేయ‌గానే టార్గెట్ బోర్డ్‌లో మొత్తం టెన్ స‌ర్కిల్స్ వుంటాయి. ఒక్కో స‌ర్కిల్‌కు ఒక్కో పాయింట్ పెరుగుతుంటుంది. లాస్ట్ స‌ర్కిల్‌కు 10 పాయింట్స్‌ వుంటాయి. ఈ సెంట‌ర్‌లో వున్న‌దానిని బుల్ జాయి అంటారు. అన్న డైలాగ్‌తోపాటు ఆట గురించి వివ‌రాలు ప‌రిచయం చేశారు. ఆ త‌ర్వాత విలువిద్య చేస్తున్న విగ్ర‌హం క‌నిపిస్తుంది. ఇదే సినిమాకు స్పూర్తి అన్న‌ట్లు టీజ‌ర్‌లోనే ద‌ర్శ‌కుడు చెప్ప‌క‌చెప్పిన‌ట్లుగా అనిపిస్తుంది.
 
- ఒక‌ప‌క్క గురువుగారి స్పూర్తి దాయ‌క‌మైన మాట‌లు మ‌రోప‌క్క ప్రియురాలు ఈస‌డింపులతోపాటు క‌న్న‌త‌ల్లికూడా ఈ ఆట‌కు ఫ్యూచ‌ర్ లేద‌నే డైలాగ్‌లు - ఆట‌గాడిలో ఎలాంటి ఫీలింగ్స్‌ను క‌లిగించాయ‌నేది క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు.
 
- ఆడే ముందు కొంత‌మందికి దేవుడ్ని చూస్తే  - వీడికి నేను ధైర్యం..అంటూ ఓ పిల్లాడిని హీరోకు చూపించ‌డం బాగుంది. 
 
- ఇది వుంటే నీతో నేనున్నట్లే.. అన్న ప్రియురాలు ఆ త‌ర్వాత షాట్‌లోనే - వాడు నిన్ను త‌ప్పించి గెల‌వానుకున్నాడు. నువ్వు త‌ప్పుడు దారిలో గెల‌వాల‌నుకున్నావ్‌.. ఇద్ద‌రూ ఒక్క‌టే.. అంటూ ఛీత్కారంగా మాట్లాడే మాట‌లు హీరోలో మ‌నోవేద‌న‌కు గురిచేసేలా వున్నాయి. 
 
- వంద‌మందికి న‌చ్చ‌క్క‌ర్లేదు. నేను ఇష్ట‌ప‌డే ఒక్క‌రు కూడా వ‌ద్ద‌నుకుంటే నేను గెలిచేది దేని కోసం సార్‌.. అనే ఆవేద‌న హీరోలో వ్య‌క్తం అవుతుంది.
 
- ఇక మీడియాతోనూ మాట్లాడుతూ,. పైన కుర్చీ పెట్టేది మీరే అక్క‌డ‌నుంచి తోసేది మీరే.. అన్న సూదిలాంటి సంభాష‌ణ‌లు ఆలోచింప‌జేసేలా వున్నాయి. 
 
- ప‌డి లేచిన‌వాడితో పందెం చాలా ప్ర‌మాద‌క‌రం..అంటూ జ‌గ‌ప‌తిబాబు డైలాగ్ స‌న్నివేశంలోనే- . హీరో సాధించి తీర‌తాడ‌నే క‌సి అందులో క‌నిపిస్తుంది. 
 
- త‌ప్పుచేసి గెల‌వ‌గ‌ల‌నేమోకానీ. అబ‌ద్దం చెప్పి బ‌త‌క‌లేను.. అన్న స‌న్నివేశం హీరో పాత్ర‌తీరును ప్ర‌తిబింబిస్తుంది. 
 
ఇలా ఆస‌క్తిక‌రంగా సాగుతూ బ‌జ్ క్రియేట్ చేసిన ఈ సినిమా వెంట‌నే చూడాల‌నిపించేలా వుంది. అందుకే ఈనెల 10 విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. యువ‌త‌కు ప్రేమేకాదు ల‌క్ష్యం ముఖ్య‌మ‌నే అంశాన్ని ద‌ర్శ‌కుడు హైలైట్ చేశాడు.
ల‌క్ష్య ట్రైల‌ర్ ను క‌ట్ చేయ‌డంలోనే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌క‌న‌బ‌డింది. త‌న‌నుకున్న ల‌క్ష్యాన్ని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ళ‌వ‌డంలో ఆక‌ట్టుకునేలా ద‌ర్శ‌కుడు తీశాడు. తొలి సినిమా అయినా ట్రైల‌ర్‌తోనే హిట్‌టాక్ సంపాదించుకున్నాడు. ఇలాంటి కొత్త ద‌ర్శ‌కులతోనే కొత్త క‌థ‌లు పుట్టుకువ‌స్తాయి.