బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 22 డిశెంబరు 2021 (16:19 IST)

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామకంపై సంచయిత పిటిషన్‌

విజ‌య‌న‌గ‌రం రాజుల గొడ‌వ మ‌ళ్ళీ మొద‌టికి వ‌చ్చింది. మాన్సాస్‌ ట్రస్టు వివాదం మ‌ళ్ళీ మొద‌లైంది. విజ‌య‌న‌గ‌రంలోని రామ‌తీర్ధం బోడి కొండ‌పై గ‌జ‌ప‌తి రాజుల‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగిన నేప‌థ్యంలో ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం మ‌ళ్ళీ వివాదాస్పదంగా మ‌రుతోంది. కోదండ రామ ఆలయ పున నిర్మాణానికి మంత్రుల శంకుస్థాపన కార్య‌క్రమంలో అశోక గ‌జ‌ప‌తి రాజు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. త‌మ‌కు తెలియజేకుండా ఆల‌య కార్య‌క్ర‌మం ఎలా చేస్తార‌ని నిల‌దీశారు. ఈ వివాదం జ‌రుగుతుండ‌గానే మాన్సాన్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్ల‌యింది.
 
   
మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామకంపై సంచయిత గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌గజపతి రాజు పునః నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ వేశారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును నియమిస్తూ, హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గతలంలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ, సంచయిత డివిజన్ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.