శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (12:45 IST)

సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై జేసీ నిర్ణయం తీసుకుంటారు : హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరల పెంపు, ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టిక్కెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా, టిక్కెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలన హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే, సినిమా టిక్కెట్ల ధలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. పాత పద్దతిలోనే టిక్కెట్లు అమ్మాలు జరగాలని ఈ సందర్భంగా సింగిల్ జడ్జి తెలిపింది.
 
అయితే, సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్కెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని సూచన చేసింది. ఈ టిక్కెట్ ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది.