ఒమిక్రాన్ వైరస్ భయం : అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం
భారత్ మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. దీంతో అన్ని దేశాలు ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, భారత్ మరోమారు అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని జనవరి 31వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు డీజీసీఐ ఉత్తర్వులు జారీచేసింది.
నిజానికి ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతిస్తామని కేంద్రం తొలుత ప్రకటించింది. కానీ, ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక నిషేధాన్ని జనవరి 31వ తేదీ వరకు పొడగిస్తూ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీచేశారు.