శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (09:34 IST)

స్పైస్ జెట్ లైసెన్స్ నెల రోజులు సస్పెండ్ : డీజీసీఏ నిర్ణయం

ప్రమాదకరమైన వస్తువుల రవాణా చేసిన స్పైస్‌‌జెట్ లైసెన్స్‌ను విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రదకరమైన వస్తువులను తీసుకువెళ్లిన స్పైస్‌జెట్ లైసెన్స్‌ను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది. 
 
స్పైస్ జెట్ తన దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించమని డీజీసీఏ తెలిపింది. కానీ, ఈ సంస్థ ఆ తరహా వస్తువులను రవాణా చేసిందని పేర్కొంది. 
 
నిజానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం, ప్రమాదకరమైన వస్తువులు ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హానికలిగించే ఆర్టికల్స్ లేదా పదార్థాలను విమానాల్లో తీసుకువెళ్లరాదు. 
 
ఒక రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడంతో లోపం జరిగిందని, డీజీసీఏ సలహామేర తాము నష్ట నివారణ, దిద్దుబాటు చర్యలు చేపట్టామని స్పైస్ జెట్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ 30 రోజుల పాటు ఆ సంస్థ లైసెన్స్‌ను డీజీసీఏ రద్దు చేసింది.